మైసూర్ ప్యాలెస్ ప్రధాన అర్చకుడి ఆత్మహత్య

1 Jul, 2016 11:30 IST|Sakshi
మైసూర్ మహరాజ్ ప్యాలెస్‌లో యువరాజుతో పూజలు చేయిస్తున్న అర్చకుడు బాలసుబ్రమణ్యం (ఫైల్)

ఆదోని టౌన్: కర్ణాటక రాష్ట్రం మైసూర్ మహరాజ్ ప్యాలెస్‌లో ప్రధాన అర్చకుడు బాలసుబ్రమణ్యం (54) అనారోగ్యంతో బాధపడుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుని భార్య శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. బాలసుబ్రమణ్యం కొంతకాలంగా బీపీ, షుగర్‌తో బాధపడేవాడు.

ఈ క్రమంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బుధవారం.. మంత్రాలయం వెళ్లేందుకు బసవ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. మార్గమధ్యలో కోసిగి మండలం ఐరన్‌గల్ వద్ద రైలు దిగి పొలాల్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో బాధితున్ని ఆదోని ఆస్పత్రికి  తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోసిగి ఎస్‌ఐ ఇంతియాజ్ బాషా తెలిపారు.
 

మరిన్ని వార్తలు