నాఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు మూసివేత

12 Dec, 2016 15:05 IST|Sakshi
అంబాజీపేట :
సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది జూ¯ŒS 24వ తేదీన ప్రారంభించిన నాఫెడ్‌ కొనుగోలు కేంద్రాల గడువు ముగియడంతో మూసివేస్తున్నట్టు ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ యు.సుధాకరరావు తెలిపారు. వాటిని మూసివేయాలని ఆయిల్‌ ఫెడ్‌ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని శుక్రవారం ఆయన విలేకరులకు వివరించారు. కోనసీమలోని అంబాజీపేట, నగరం, తాటిపాక, ముమ్మిడివరం, కొత్తపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నవంబర్‌ 30 వరకు 33,185 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. వీటికి సంబంధించి రూ.19.75 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. ఇంకా రూ.2.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బహిరంగ మార్కెట్‌లో కొత్త కొబ్బరి ధర రూ.5,900 నుంచి రూ.6వేలు వరకు పెరగడం, గడువు ముగిడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. 
 
మరిన్ని వార్తలు