సీమ ద్రోహి చంద్రబాబు

16 Sep, 2016 22:49 IST|Sakshi
సీమ ద్రోహి చంద్రబాబు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : 

సీమకు అన్ని రంగాల్లో  అన్యాయం చేస్తున్న చంద్రబాబు  రాయలసీమ ద్రోహి అని సీపీఎం సీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబులు  పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో  విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు  అన్యాయం చేస్తున్నాయని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాల్సిందిపోయి మోడీ, చంద్రబాబులు దొంగనాటకాలు ఆడుతూ   ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అన్ని సౌకర్యాలు ఉన్నా  ఫీజిబిలిటీ లేదనడం సరికాదన్నారు. చంద్రబాబు కేంద్రం చేతిలో Mీ లు బొమ్మలా మారి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ మాత్రమే చాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. కర్నూలు జిల్లాలో వ్యాగన్‌ల కంపెనీని నిర్మిస్తామన్నారని, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీని నెలకొల్పుతామని చెప్పి ఇంత వరకు ఆ మాటే ఎత్తడం లేదన్నారు.

చిత్తూరు జిల్లాలో మన్నవరం, బీహెచ్‌సీఎల్‌ ప్రాజెక్టు తయారీ కేంద్రాన్ని రూ. 6 వేల కోట్లతో నిర్మాణం చేపట్టాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు.  సీమకు జీవనాధార ప్రాజెక్టులైన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సాగు నీరు అందించాలన్నారు. వెనుకబడ్డ రాయలసీమకు జిల్లాకు రూ 50 కోట్లు మాత్రమే నిధులు ఇలా ఐదు సంవత్సరాలిస్తే ఏఒక్క ప్రాజెక్టు పూర్తి కావన్నారు.సీమ జిల్లాలో ఉపాధి కల్పించే ఒక భారీ పరిశ్రమ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ రాష్ట్ర «అధ్యక్షుడు హరిబాబు ఉక్కు పరిశ్రమపై ప్రతిపక్షాలు రాద్దాంతాలు అనవసరమని చెప్పడం సిగ్గు చేటన్నారు.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు రాయలసీమ పట్ల వివక్షత చూపుతూ అన్ని విషయాల్లో అన్యాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ, సీపీఎం చిత్తూరు జిల్లా సెక్రటరీ కుమార్‌రెడ్డి, అనంతపురం సీపీఎం జిల్లా సెక్రటరీ వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి అంజనేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు