‘కోదండరాం అడ్డుకోవటం విడ్డూరం’

28 Jul, 2016 19:39 IST|Sakshi
‘కోదండరాం అడ్డుకోవటం విడ్డూరం’

మేడ్చల్(రంగారెడ్డి): ‘మా తెలంగాణ మాకు కావాలి.. మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే..’ అంటూ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మూడు జిల్లాల రైతులకు న్యాయంచేసే మల్లన్నసాగర్‌ను అడ్డుకోవాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నగరపంచాయతీ అత్వెల్లిలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ కోదండరాం ప్రతిపక్షాల ఉచ్చులో పడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందించే మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడం మంచిదికాదన్నారు.

ముంపు గ్రామాలకు వెళ్లి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఉనికి కోసం మల్లన్న సాగర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. భూములు ఏ విధంగా తీసుకుంటున్నారో రేవంత్‌రెడ్డికి కనబడడంలేదా అని ప్రశ్నించారు. ప్రజాబలం ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇలాంటి శక్తులు ఏమీ చేయలేవన్నారు.

మరిన్ని వార్తలు