రేపటి నుంచి కర్నూలులో నంది నాటకోత్సవాలు

17 Jan, 2017 00:04 IST|Sakshi
– జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): నందినాటకోత్సవాలను బుధవారం నుంచి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఫిబ్రవరి 2 వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిని 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారని తెలిపారు. నాటకోత్సవాలకు కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. నందినాటకోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు తిలకించవచ్చని తెలిపారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు