చోళుల కాలంనాటి నంది విగ్రహం చోరీ

9 Aug, 2015 10:00 IST|Sakshi

గుంటూరు : నల్లరాయితో చేసిన అతిపురాతనమైన నంది విగ్రాహాన్ని దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలోని శ్రీబాలత్రిపుర సుందరి సమేత శంకరస్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకుంది. దాంతో భక్తుల తాకిడి చాలా వరకు తగ్గింది.

ఇదే అదునుగా భావించిన దుండగులు ఆలయ ఆవరణలో ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని అపహరించుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన నంది విగ్రహాం నాలుగో శతాబ్దం నాటిదని స్థానికులు తెలిపారు.  ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని స్థానికులకు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు