అపోలో చేతికి నంద్యాల అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు

24 Sep, 2016 00:37 IST|Sakshi
భీమవరం రోడ్డులోని హరిజనవాడ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌
నంద్యాల రూరల్‌:   అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ప్రభుత్వం మంగళం పాడింది. వాటిని కార్పొరేట్‌ సంస్థ అపోలోకు అప్పగించింది.  దీంతో ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం నంద్యాలలోని వైఎస్సార్‌నగర్, ఆత్మకూరు బస్టాండ్, భీమవరం రోడ్డులోని హరిజనవాడ, ఎంఎస్‌నగర్, దేవనగర్‌లలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. 2000 సంవత్సరం జూలై 1న 15 వేల మందికి ఒక అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ చొప్పున ప్రభుత్వం నంద్యాలలో మొత్తం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి.  అక్టోబర్‌ 2 నుంచి∙ఈ సెంటర్లు అపోలో క్లీనిక్‌లుగా మారనున్నాయి.  ఇప్పటి వరకు   హెల్త్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తమను అపోలో యాజమాన్యం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియక సతమతమవుతున్నారు.  
 
మరిన్ని వార్తలు