నాడు...నేడు

17 Jun, 2017 23:49 IST|Sakshi
 
నాటి నాన్న...
ఎదురు పడితే భయం ... మాట్లాడాలంటే ‘అమ్మో’ ... 
కన్నెర్ర చేస్తే గజగజ ... గద్దిస్తే ఇక జ్వరమే
పుస్తకం, పెన్ను, పెన్సిల్‌,  ఏ అవసరమున్నా 
అమ్మే మధ్యవర్తి
జిహ్వ చాపల్యం తీర్చుకోవాలన్నా, నేత్రానందం తీరాలన్నా
కన్న తల్లే నిచ్చెన...
.
నాన్నకు కోపం వచ్చి కొట్టడానికి నా పైకి వస్తే
అడ్డుకున్న పుణ్యానికి సగం దెబ్బలు అమ్మకే
మిగిలిన అరకొరే నాపైకి...
.
నేటి డాడీ...
.
తరం మారింది... స్వరం మారిపోయింది
అమ్మ కొడితే...తిడితే
వెనుకేసుకొచ్చే డాడీలొచ్చేశారు
.
ఇన్నాళ్లూ వంతెనగా నిలిచిన అమ్మ పాత్ర అదృశ్యమైంది
ఏ ఆనందమైనా చిటికెలో
తీర్చే నాన్న అనురాగం సాక్షాత్కరించింది
.
అమ్మకు కోపం వస్తే నాన్నే అడ్డుపడి...
గుండెలపై కాదు ... తన భుజాలపై 
కొలువుదీరనిచ్చి...ఆప్యాయతలు పంచి
అనురాగాలతో పెంచిన 
కనిపించిన దేవుళ్లు 
నేటి మన డాడీలు...
 
 
 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు