బాలమురళి కారణజన్ముడు

12 Dec, 2016 15:02 IST|Sakshi
బాలమురళి కారణజన్ముడు
నన్నయ వీసీ ముత్యాలునాయుడు
పుస్తక సంబరాల్లో ‘స్వర నివాళి’
రాజమహేంద్రవరం కల్చరల్‌ : గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కారణజన్ముడని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముత్యాలునాయుడు అన్నారు. ప్రభుత్వ అటానస్‌ కళాశాలలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల వేదికపై బుధవారం బాలమురళీకృష్ణకు స్వరనివాళి సమర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగు నేలకు, సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని చేకూర్చిన మంగళంపల్లి లేని లోటు తీరనిదని అన్నారు. విజయశంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల కూచిపూడి అధ్యాపకుడు పసుమర్తి శ్రీనివాసశర్మ మాట్లాడుతూ బాలమురళి స్వరం మధురం, వాక్కు చమత్కారభరితమన్నారు. సాహితీవేత్త రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరూ ప్రశ్నించలేని స్థాయిలో తెలుగు గాయకులకు బాలమురళి కంఠం గుర్తింపు తెచ్చిందన్నారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ ఎన్నో జీవిత సత్యాలు, తత్వాలను బాలమురళి ఆలపించారన్నారు. గాయని ఎం.పార్వతి బాలమురళి గానం చేసిన ‘ఏమి సేతురా లింగా’, ‘ఊగుమా ఊయల’ తదితర గీతాలను ఆలపించారు. వయొలి¯ŒS విద్వాంసుడు కొక్కొండç సూర్యసుబ్రహ్మణ్యం బాలమురళి గానం చేసిన ‘వస్తా వట్టిదే–పోతా వట్టిదే–ఆశ ఎందుకంటా–చేసిన ధర్మము–చెడని పదార్థము’ అన్న గేయాన్ని ఆలపించారు. ముందుగా వీసీ బాలమురళి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. నన్నయ వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టి.సత్యనారాయణ, విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్యపాఠశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.వి.ప్రసన్నకుమారి  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు