ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీకి జాతీయ గుర్తింపు

26 Oct, 2016 22:47 IST|Sakshi
ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీకి జాతీయ గుర్తింపు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీకి జాతీయ గుర్తింపు లభించిందని ఆర్డీటీ ఫుట్‌బాల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ విజయభాస్కర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీ స్థాపించి రాయలసీమ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ఫుట్‌బాల్‌ క్రీడలో వారిని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 24 మండల స్థాయి ఫుట్‌బాల్‌ అనుబంధ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఆర్డీటీ చేస్తున్న కషికి ఫలితంగా ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) జాతీయ స్థాయిలో గుర్తింపును కల్పిస్తూ ఏఐఎప్‌ఎఫ్‌ కార్యదర్శి కుషల్‌దాస్, టెక్నికల్‌ డైరెక్టర్‌ స్కాట్‌ ఓ డోనెల్‌లు అక్రిడిటేషన్‌ను జారీ చేశారన్నారు. జాతీయస్థాయి గుర్తింపు లభించినందుకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్, ఫుట్‌బాల్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ మైఖెల్‌లిడో హర్షం వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు