జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏపీ జట్టు

20 Dec, 2016 23:54 IST|Sakshi

వెంకటేశ్వరపురం(నంద్యాల రూరల్‌): ఈనెల 22 నుంచి 24 వరకు ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో జరిగే 62వ జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 బాలబాలికల రగ్బీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేసినట్లు రగ్బీ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్‌డీఆర్‌ వరల్డ్‌ స్కూల్‌లో రాష్ట్ర జట్టు క్రీడాకారులతో స్కూల్‌ చైర్మన్‌ కొండారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జట్టు కర్నూలు శ్రీలక్ష్మిప్రియ, గురురుషిక, చిట్టెమ్మ, శ్రీవల్లి, భారతి, అనూష, శివాణి, నెల్లూరుకు చెందిన శిల్పా, సాయివిహారిక, చిత్తూరుకు చెందిన జాహ్నవి, కడపకు చెందిన భవ్య నందిని, బాలుర విభాగంలో కర్నూలుకు చెందిన దివాకర్, సురేంద్ర, సందీప్, నెల్లూరుకు చెందిన షబ్బీర్, నవీన్, అబ్దుల్లా, శ్రీకాంత్, గుంటూరుకు చెందిన సాయిరంజిత్, గురుకృష్ణ, చిత్తూరుకు చెందిన శంకర్, మోహన్, కడపకు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు ఎంపికయ్యారని వివరించారు. 

మరిన్ని వార్తలు