కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు

4 Oct, 2016 23:27 IST|Sakshi
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్‌: భువనగిరి పట్టణంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్‌–19 జాతీయ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఆర్డీఓ ఎంవీ. భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్‌సీఓ మాక్బుల్‌ అహ్మద్, జిల్లా క్రీడల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గువ్వ దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జి. సోమనర్సయ్యలు ఉన్నారు. రెండవ రోజు బాల్‌బాడ్మింటన్‌ బాలుర విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 12 జట్లు పోటీ పడ్డాయి. అదే విధంగా షూటింగ్‌ బాల్‌ బాలుర విభాగంలో 6 జట్లు తలపడ్డాయి.
షూటింగ్‌ బాల్‌ ఫైనల్‌ విజేతలు వీరే
జాతీయ స్థాయి షూటింగ్‌ బాల్‌ ఫైనల్‌ బాలికల విభాగంలో మహారాష్ట్ర ప్రథమ స్థానం సాధించగా, ఢిల్లీ రెండోస్థానం, తెలంగాణ తృతీయ స్థానాలు సాధించాయి. అదే విధంగా బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి స్థానం, పంజాబ్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
బాల్‌బ్యాడ్మింటన్‌ విజేతలు
బాలుర విభాగంలో...
ఒడిశా, సీబీఎస్‌ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఒడిశా జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–23, 35–22తో కర్నాటక, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–14, 35–21 తేడాతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–15, 35–19 తేడాతో గుజరాత్, మధ్యప్రదేశ్‌తో 35–22, 32–35, 35–21 తేడాతో విద్యాభారతి, సీబీఎస్‌ఈతో 35–12, 35–12 తో తమిళనాడు, పాండిచ్ఛేరితో 35–30, 35–33తో తెలంగాణ జట్లు విజయం సాధించాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఏపీ, ఉత్తరప్రదేశ్‌తో 35–12, 35–19తో ఛత్తీస్‌గఢ్, పాండిచ్ఛేరితో 35–25, 35–23తో కేరళ, ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 35–25, 35–31 తేడాతో ఛండీగఢ్‌లు విజయం సాధించాయి. 
బాలికల విభాగంలో....
తెలంగాణ, పంజాబ్‌ జట్లు మధ్యన జరిగిన మ్యాచ్‌లో 35–21,35–25తో తెలంగాణ జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఒడిశాతో 35–24, 35–25తో మహారాష్ట్ర, గుజరాత్‌తో 35–20, 35–28తో ఛత్తీస్‌గఢ్, సీబీఎస్‌ఈతో 35–8, 35–14తో కర్నాటక, ఢిల్లీతో 35–18, 35–25తో కేరళ జట్లు విజయం సాధించాయి. అలాగే మధ్యప్రదేశ్‌తో 35–20, 35–22తో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో 35–19, 35–18తో కేరళ, పంజాబ్‌తో 35–15స 35–13తో కర్నాటక, ఉత్తరప్రదేశ్‌తో 35–16, 35–12తో ఒడిశా, విద్యాభారతితో 35–14, 35–11తో చంఢీగడ్, గుజరాత్‌తో 35–33, 21–35, 35–23తో ఢిల్లీ జట్లు విజయం సాధించాయి.
 
 
 
 
మరిన్ని వార్తలు