జాతీయ వాలీబాల్‌ విజేత పోస్టల్‌ కర్ణాటక- జేపీఆర్‌ చెన్నై

28 Feb, 2017 23:06 IST|Sakshi
జాతీయ వాలీబాల్‌ విజేత పోస్టల్‌ కర్ణాటక- జేపీఆర్‌ చెన్నై
బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రులు 
ముగిసిన క్రీడా సంబరం
అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పురుషుల విభాగం పోస్టల్‌ (కర్ణాటక), మహిళ విభాగంలో జేపీఆర్‌ (చెన్నై) జట్లు విజేతగా నిలిచాయి. లీగ్‌ పద్ధతిలో జరిగిన పోటీల్లో పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో ద్వితీయస్థానంలో సీఆర్పీఎఫ్‌ (ఢిల్లీ), తృతీయ స్థానంలో వెస్ట్రన్‌ రైల్వే (ముంబై) నిలవగా, నాలుగో స్థానంలో ఆంధ్రా స్పైకర్‌ నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఇన్‌కంటాక్స్‌ చెన్నై, సాయి గుజరాత్‌ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో జెపీఆర్‌ చెన్నై జట్టు విన్నర్స్‌గాను, రన్నర్స్‌గా మైసూర్‌ హాస్టల్‌ కర్ణాటక జట్టు, మూడో స్థానంలో ఎస్సీ రైల్వే సికింద్రాబాద్, నాలుగో స్థానంలో సాయి గుజరాత్‌ జట్లు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు రూ.60 వేలతోపాటు ట్రోఫీనందుకున్నాయి. 
ముగిసిన పోటీలు
జాతీయ వాలీబాల్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి చింతకాలయ అయ్యన్న పాత్రుడు, వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఎమ్మెల్సీలు బోడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు, నిమ్మల రామానాయుడు, పులపర్తి నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమశెట్టి రామానుజయ, మున్సిపల్‌ చైర్మన్‌ చిక్కాల గణేష్, ఏరియా ఆసుపత్రి చైర్మన్‌ మెట్ల రమణబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు