పోటీకి దీటుగా రాణించాలి

26 Oct, 2016 20:10 IST|Sakshi
పోటీకి దీటుగా రాణించాలి

విజయవాడ(వన్‌టౌన్‌):  పోటీ ప్రపంచానికి దీటుగా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పారిశ్రామికవేత్త ఎంవీకే హరగోపాల్‌ అన్నారు. కేబీఎన్‌ కళాశాల ఎంసీఏ అండ్‌ ఎంఎస్సీ(కంప్యూటర్స్‌) విభాగం ఆధ్వర్యంలో ‘ఇమేజ్‌ ప్రొసెసింగ్‌ యూజింగ్‌ ఆర్‌ ప్రోగ్రామింగ్‌’ అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్‌ రంగంలో చోటుచేసుకుంటున్న ప్రగతితో యావత్‌ ప్రపంచం పరుగులు తీస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులు నూతన అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల పీజీ కో–కన్వీనర్‌ కే.వీ.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతికి కళాశాల యజమాన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్‌పర్సన్, యోగివేమన విశ్వవిద్యాలయం సీఎస్‌ఈ విభాగ ఆచార్యులు డాక్టర్‌ సి.నాగరాజు మాట్లాడుతూ ‘ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ యూజింగ్‌ ఆర్‌ ప్రోగ్రామింగ్‌’ అంశం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ ఎస్‌.రజిత్‌కుమార్‌ మాట్లాడారు. సభలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ.నారాయణరావు, పీజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డీ.వీ.రమణమూర్తి, పీజీ కోర్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.నరసింహారావు, విభాగాధిపతి పీఎల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు