ఆదివాసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

24 Aug, 2016 00:27 IST|Sakshi
హన్మకొండ అర్బన్‌ : జల్‌జంగల్, జమీన్‌ కోసం కొమురంభీం స్ఫూర్తితో ఆదివాసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ ప్రజాసామాజిక వేదిక ప్రతినిధి, ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్, ఖమ్మం జిల్లాల బస్సుయాత్రను మంగళవారం హన్మకొండలోని నక్కలగుట్ట కాళోజీ జంక్షన్‌ వద్ద మంగళవారం ఆమె జెండా ఊపి ప్రారంబించా రు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మ హే మాట్లాడుతూ ఆదివాసీల జీవితమే ఒక చైతన్యమన్నారు.
 
ఆదివాసీలు చేసే పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్‌ ఈసం నారాయణ మాట్లాడుతూ దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసీల భూములు లాక్కునే ప్రయ త్నాలకు వ్యతిరేకంగానే బస్సుయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పోడు భూములు లాక్కోవడం ద్వారా ఆదివాసీలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. వాస్తవంగా అడవులను నాశనం చేస్తున్న శక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్‌ చేశా రు. ఈనెల 26వరకు బస్సుయాత్ర ముగుస్తుందని, సెస్టెంబర్‌ 6న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు