కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

12 Apr, 2017 23:34 IST|Sakshi
కర్నూలులో నీట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
– ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో నీట్‌ ( Neet) సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..బుధవారం పార్లమెంటులో ఇద్దరు మంత్రులను కలిసినట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌లను వేర్వేరుగా కలిసి కర్నూలులో నీట్‌ ఆవశ్యకతను ఎంపీ వివరించారు. ఎంతోమంది నీట్‌కు సిద్ధమవుతున్నారని, ఇక్కడ పరీక్ష కేంధ్రఃలేనందున అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏపీలో నాలుగు చోట్ల మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇవి కర్నూలు నియోజకవర్గం నుంచి సుమారు 300 నుంచి 400 కి.మీ. దూరంలో ఉన్నాయని, విద్యార్థులు అక్కడికి చేరుకోవడానికే 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని చెప్పారు.
 
మరిన్ని వార్తలు