ఆర్మీ క్యూ కష్టాలకు ఇక సెలవు

17 Dec, 2016 03:27 IST|Sakshi
ఆర్మీ క్యూ కష్టాలకు ఇక సెలవు

► బేస్‌ క్యాంటీన్ గా మారిన గిద్దలూరు   
► ఒంగోలు క్యాంటీన్ లో రెట్టింపు సరుకులు

మాజీ సైనికులు, సైనికుల కుటుంబాల ’’క్యూ’’ కష్టాలకు సెలవు పడనుంది. సరుకులు రావడం ఆలస్యమవడంతో అర్హులు క్యూలో బారులు తీరుతున్నారు. అందుకు కారణం మాజీ సైనికుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో అవసరమైన మేర సరుకులు అందే పరిస్థితి లేకపోవడమే. అయితే ప్రస్తుతం మరో పక్షం రోజుల్లో ఈ కష్టాలకు చెల్లు చీటీ ఇవ్వనున్నారు. – ఒంగోలు

ఏళ్ల తరబడి జిల్లాలోని మాజీ సైనికులు, సైనిక కుటుంబాలు చేసిన పోరాటం ఫలితంగా మూడేâýæ్ల కిందట ఒంగోలు మిలటరీ సబ్‌క్యాంటీన్ కు అంకురార్పణ జరిగింది. స్థానిక సెయింట్‌ జేవియర్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో తమ ప్రాంతంలోను సబ్‌ క్యాంటీ¯ŒS ఏర్పాటు చేయాలంటూ పశ్చిమ ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎక్కువుగా జిల్లాకు చెందిన వారిలో ఎక్కువమంది సైన్యంలో పనిచేసింది, పనిచేస్తుంది కూడా పశ్చిమ ప్రాంతం వారే. రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్‌ బేస్‌ క్యాంటీన్ నుంచి ఒంగోలు సబ్‌క్యాంటీన్కు సరుకుల సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రత్యేకంగా పోరాటం జరిపి ప్రజాప్రతినిధులు, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఒంగోలును పూర్తిస్థాయి క్యాంటీన్ గా ప్రకటించింది. దీంతో ప్రత్యేక టిన్ నంబర్‌తో ఒంగోలు క్యాంటీన్ కు సరుకులు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ ప్రాంతం వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా గిద్దలూరులో సబ్‌క్యాంటీన్ కు అనుమతి లభించింది.
 
కొనుగోలు ఇలా
ఒంగోలు మిలటరీ క్యాంటీన్ కు రూ. 60 లక్షల వరకు నగదు నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తంతో మిలటరీ స్టోర్‌ నుంచి సరుకులు కొనుగోలు చేసి ఒంగోలు క్యాంటీన్ కు తెచ్చేవారు. అయితే ఇక్కడకు వచ్చిన సరుకుల్లో దాదాపు 50 నుంచి 60 శాతం సరుకులను ఒంగోలుకు అనుబంధంగా కేటాయించిన మూడు సబ్‌క్యాంటీన్ లకు సరుకులు పంపేవారు. గిద్దలూరు, శ్రీకాకుâýæం, గుంటూరులలో ఈ మూడు సబ్‌ క్యాంటీన్లు ఉన్నాయి. దీంతో ఉన్న మొత్తంలో రూ. 30 నుంచి రూ. 35 లక్షల వరకు సరుకు ఈ మూడు సబ్‌క్యాంటీన్ లకు సరఫరా చేసేవారు.

తాజాగా వెలువడిన ఉత్తర్వులు ప్రకారం ఒంగోలుకు అనుబంధంగా ఉన్న మూడు సబ్‌క్యాంటీన్ లను కూడా క్యాంటీన్ లుగా మార్పు చేశారు. అంటే ఇక నుంచి గుంటూరు,   శ్రీకాకుâýæం, గిద్దలూరు క్యాంటీన్ లకు సరుకులు ఒంగోలు నుంచి వెళ్లాల్సిన అవసరంలేదు.  వాటికి పూర్తిస్థాయిలో టిన్  నంబర్లు రావడం తదితర జాప్యాల కారణంగా ఈ నెల మొదటి దశలో తీసుకువచ్చే సరుకు నుంచి మాత్రం మూడు క్యాంటీన్ లకు సరుకులను కేటాయించాలని ఆదేశించారు. రెండో దఫా అంటే ఈ నెల 22 నుంచి కొనుగోలు చేసే సరుకులు మాత్రం ఒంగోలు క్యాంటీన్ నుంచే విక్రయించడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు