‘కొత్త’బాస్‌లు

10 Oct, 2016 23:39 IST|Sakshi
(10కెజిఎం11): రాజీవ్‌గాంధీ హన్మంతు, అంబర్‌కిషోర్‌ ఝా
 • భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
 • ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝా
 •  
  సాక్షి ప్రతినిధి, కొత్తగూడెం : జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడనున్న భద్రాద్రి జిల్లాకు ‘కొత్త’ బాస్‌లు ఖరారయ్యారు. జిల్లా కలెక్టర్‌గా భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న అంబర్‌కిషోర్‌ ఝాను జిల్లా ఎస్పీగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఆవిర్భావరోజైన మంగళవారమే ఇద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారు. ఉదయం 11:13 నిమిషాలకు కలెక్టర్‌ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. రాజీవ్‌గాంధీ హన్మంతు పదినెలలుగా  పీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భద్రాచలం, కొత్తగూడెం భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆయనను భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా నియమించినట్లు భావిస్తున్నారు. అంబర్‌కిషోర్‌ ఝాకు పోలీస్‌శాఖలో మంచి పేరుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్, నిర్మల్‌ ఓఎస్‌డీగానూ పనిచేసి వరంగల్‌ జిల్లాకు అడిషనల్‌ ఎస్పీగా వచ్చారు. ఆపై వరంగల్‌ రూరల్‌ ఎస్పీ అక్కడే ఉద్యోగోన్నతి పొందారు.  కొత్తగూడెం కలెక్టర్‌ కార్యాలయం ఏఓగా మస్తాన్‌రావు నియమితులయ్యారు.  కొత్తగా ఏర్పడిన లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయాలు,  పోలీస్‌ స్టేషన్లను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రారంభించనున్నారు. కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లాగా ఏర్పడుతుండటంతో జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిపేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తమయ్యాయి.
  సంతోషంగా ఉంది: రాజీవ్‌గాం«ధీ హన్మంతు
  కొత్త జిల్లా భద్రాద్రిలో తొలి కలెక్టర్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది. పది నెలలపాటు ఐటీడీఏ పీఓగా పనిచేశాను. భద్రాచలం ఐటీడీఏ కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉంది. జిల్లా అభివృద్ధికి పదింతలు పనిచేసి.. ప్రజలకు సేవ చేస్తాను. అందరి సహకారంతో ముందుకు సాగుతా.

  • రాజీవ్‌ నేపథ్యం:

  పేరు :  రాజీవ్‌గాంధీ హనుమంతు
  జననం :16-06-1987
  తల్లి : వనజాక్షి ( టీచర్‌)
  తండ్రి : కృష్ణారావు ( అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారి)
  అక్క యూఎస్‌లో ఎంఎస్‌ న్యూరాలజీ చేస్తున్నారు.  
  భార్య : విజయలక్ష్మి( ఎల్‌ఎల్‌బీ చదివారు)
  కుమార్తె : ప్రేరణ
  స్వస్థలం : పలాస, శ్రీకాకులం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
  1 నుంచి 8 వరకూ పొలాకి(పభుత్వ పాఠశాల)
  9,10 పలాసలో
  ఇంటర్‌ (నారాయణ కాలేజ్‌), ఇంజీనీరింగ్‌, విశాఖపట్నం(ఏయూ)
  2010లో సివిల్‌ సర్వీసెస్‌ రాసి 719 ర్యాంకుతో ఐఆర్‌టీఎస్‌కు ఎంపిక
  2011లో రెండోసారి సివిల్స్‌ రాసి 131వ ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు.
  వరంగల్‌ జిల్లాలో అసిస్టంట్‌ కలెక్టర్‌గా (ట్రైనీ)  పనిచేశారు
  13-01-2015 అదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
   15-12-2015న భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధుల్లో చేరారు.


   

మరిన్ని వార్తలు