హీరోయిన్ గానే చేస్తా...

9 Jul, 2016 11:23 IST|Sakshi
హీరోయిన్‌గానే నటిస్తా...
  • వర్థమాన హీరోయిన్ మోనీక శ్రీవాత్సవ్
  • మల్కాపురం : గుర్తింపు ఉన్న పాత్రలకే తను తొలి ప్రాధాన్యం ఇస్తానని, హీరోయిన్‌గా కాకుంటే మరే ఇతర పాత్రలు చేసేది లేదని వర్థమాన హీరోయిన్ మోనీక శ్రీవాత్సవ్ చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి ఓ యువతి తొలిసారిగా హీరోయిన్‌గా సినిమాలో నటించే అవకాశం పొందడం ఇదే ప్రథమం. ఈ ఘనత దక్కించుకుంటున్న మోనిక ‘సాక్షి’తో తన ఆనందాన్ని పంచుకుంది. స్థానిక ఆర్‌కె పురం వద్ద నివాసముంటున్న మోనిక తన గురించి, కెరీర్ గురించి ఇలా వివరించింది.
     
    కేవీలో చదువుకున్నా

    స్థానిక కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ వరకు చదువుకున్నాను. బుల్లయ్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగుళూర్‌లో ఎంబీఏ చదువుతున్నా. నాన్న డాక్టర్ చంద్రశేఖర్ మాజీ నేవీ ఉద్యోగి, తల్లి అంజూశేఖర్ గృహిణి.

    చిన్నప్పటి నుంచి మోడలింగ్‌పై ఆసక్తి

    ఇంటర్ చదువు నాటి నుంచి నాకు మెడలింగ్‌పై ఆసక్తి ఉంది. అందుకే మోడలింగ్ రంగంలో ప్రవేశించాను. 2013లో నగరంలోని ఓ స్టార్ హోటల్ జరిగిన మిస్ వైజాగ్ పోటీలలో పాల్గొని రన్నర్‌గా నిలిచాను.. 2014లో బెంగుళూరులో జరిగిన అందాల పోటీలలో మిస్ బెంగళూరు విన్నర్‌గా నిలిచాను. ఇదే సంవత్సరంలో ఐపీఎల్‌కు మోడల్‌గా ఎంపికయ్యాను.
     
    అనుకోని అవకాశం

    నేను మోడల్‌గా చేసిన ఫొటోలు చూసిన అన్న క్రియేషన్ సంస్థ తన బ్యానర్‌లో మోనికకు హీరోయిన్‌గా నటించే అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పేరు ‘ఆ ముగ్గురు’. ఈ చిత్రంలో అంతా కొత్త నూతన నటీనటులే.  ఈ తెలుగు చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. అప్పుడే తమిళంలో ఓ చిత్రంలో నటించేందుకు కూడా అవకాశం వచ్చింది. అయితే గుర్తింపు ఉన్న పాత్రలే చేస్తాను. లేదంటే మోడలింగ్‌లో రాణించి మంచి పేరు తెచ్చుకుంటా. తెలుగు చిత్రంలో తొలిసారిగా తనకు హీరోయిన్‌గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నటన ద్వారా తన సంపాదనలో కొంత పేదలకు, అనాథలకు, వృద్థులకు సాయమందిస్తా.

మరిన్ని వార్తలు