సరికొత్త మండలం అన్నపురెడ్డిపల్లి

5 Oct, 2016 23:31 IST|Sakshi
చండ్రుగొండ
  • కొత్త మండలానికి ప్రతిపాదనలు
  •  విభజన ఏర్పాట్లలో యంత్రాంగం
  • 8 పంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలతో తుది నివేదిక
  • అన్నపురెడ్డిపల్లి స్వరూపం
    పంచాయతీలు: 8
    రెవెన్యూ గ్రామాలు: 10
    విస్తీర్ణం : 170.58 చ.కి.మీ
    జనాభా : 21,135
    గృహాలు : 5,526
    చండ్రుగొండ:
        అన్నపురెడ్డిపల్లి దశ మారనుంది. దీన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో విభజన ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలైంది. 8 పంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలతో తుది నివేదిక తయారు చేసిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
    - పంచాయతీల వివరాలు: అన్నపురెడ్డిపల్లి, పెంట్లం, నర్సాపురం (రాజాపురం), ఊటుపల్లి, అబ్బుగూడెం, మర్రిగూడెం (తెలిజర్ల), పెద్దిరెడ్డిగూడెం, గుంపెన.
    రెవెన్యూ గ్రామాలు : అన్నపురెడ్డిపల్లి, అన్నదైవం, పెంట్లం, నర్సాపురం, ఊటుపల్లి, పెద్దిరెడ్డిగూడెం, గుంపెన, తెలిజర్ల, అబ్బుగూడెం, నామవరం.
    మరింతగా అభివృద్ధి..
    మండలకేంద్రంగా ఏర్పాటు కావడంతో అన్నపురెడ్డి పల్లికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం చండ్రుగొండలంలో అంతర్భాగంగా ఉన్న అన్నపురెడ్డిపల్లి మండలకేంద్రానికి 23 కి.మీ దూరంలో ఉంది. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతంగా ఉన్న అన్నపురెడ్డిపల్లిలో అత్యధికశాతం ఆదివాసీలు, ఇతర తెగలకు చెందిన గిరిజనులే అధికంగా ఉన్నారు.
    - రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండలకేంద్రానికి సరిహద్దులు కాబోతున్న చండ్రుగొండ, కొత్తగూడెం, మరోవైపు ముల్కలపల్లి మీదుగా పాల్వంచ, దమ్మపేట, సత్తుపల్లి మండలాలకు బీటీరోడ్లు ఉన్నాయి.
    -  గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానాలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు  ఈ ఆలయాలను దర్శించుకుంటారు.
    - రాజకీయంగా ఈ ప్రాంతం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. పేరున్న రాజకీయనాయకులెవరూ ఇక్కడ లేరు.
    - అన్నపురెడ్డిపల్లిలో సామాన్య కుటుంబానికి చెందిన మారగాని శ్రీనివాసరావు స్వయంకృషితో విద్యావేత్తగా ఎదిగారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గ్రామాభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని శివభక్తుల సహకారంతో రూ.3 కోట్ల వ్యయంతో శివాలయాన్ని అభివృద్ధి చేశారు.
    - మండలకేంద్రంగా ఆవిర్భవించడంతో అభివృద్ధి పరంగా అన్నపురెడ్డిపల్లి ముందంజలో ఉంటుందని స్థానికులు ఆశిస్తున్నారు.

     

మరిన్ని వార్తలు