ఎన్‌జీఓ అసోసియేషన్‌ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

16 Nov, 2016 01:44 IST|Sakshi
  • రెండోసారి పగ్గాలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులు
  •  
    నెల్లూరు(పొగతోట): నాన్‌గజిటెడ్‌ ఆఫీసర్స్‌(ఎన్‌జీఓ) అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్‌వీర్‌సీ. శేఖర్‌రావు, వై.రమణారెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అ«ధికారి శివరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 14న ఎన్‌జీఓ అసోసియేషన్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. 15 పోస్టులకు 16 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన శ్రీకాంత్‌ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నికయ్యేటట్లు చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఏసీఆర్‌ఎస్‌ఏ నాయకులు నరసింహులు, కృష్ణారావు, ఏ.పెంచలరెడ్డి, భాను, మనోహర్‌బాబు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు.
    నూతన కార్యవర్గం 
    అ«ధ్యక్షుడిగా సీహెచ్‌వీఆర్‌సీ. శేఖర్‌రావు(ఇరిగేషన్‌), కార్యదర్శిగా వై. రమణారెడ్డి(మెడికల్‌ అండ్‌ హెల్త్‌) ఎన్నిక కాగా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎన్‌.ఆంజనేయవర్మ(మెడికల్‌ అండ్‌ హెల్త్‌), ఉపాధ్యక్షులుగా ఎంవీ సువర్ణకుమారి(వ్యవసాయ శాఖ), జి.రమేష్‌బాబు (ఇరిగేషన్‌), ఎన్‌.గిరిధర్‌(ఐసీడీఎస్‌), ఎస్‌కే.సిరాజ్‌ (రెవెన్యూ), ఎల్‌.పెంచలయ్య(జిల్లా పరిషత్‌) ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.పెంచలరావు (మెడికల్‌ అండ్‌ హెల్త్‌), జాయింట్‌ సెక్రటరీలుగా ఎన్‌.శ్రీనివాసులు(అకౌంట్స్‌ ఆఫీస్‌), పి.సతీష్‌బాబు(మెడికల్‌ అండ్‌ హెల్త్‌), కె.రాజేంద్రప్రసా«ద్‌(విద్య శాఖ), ఇ.విజయకుమార్‌ (సాంఘిక సంక్షేమ శాఖ), మహిళా జాయింట్‌ సెక్రటరీగా ఇ.కరుణమ్మ(మెడికల్‌ అండ్‌ హెల్త్‌), కోశాధికారిగా బి.వెంకటేశ్వర్లు(మెడికల్‌ అండ్‌ హెల్త్‌) ప్రమాణ స్వీకారం చేశారు.                     
     
     
మరిన్ని వార్తలు