ఎన్‌జీ రంగా టైంస్కేల్‌ ఉద్యోగుల నిరసన ర్యాలీ

4 Aug, 2016 21:24 IST|Sakshi
ఎన్‌జీ రంగా టైంస్కేల్‌ ఉద్యోగుల నిరసన ర్యాలీ
 
గుంటూరు రూరల్‌ : ఆచార్య ఏన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం టైం స్కేలు ఉద్యోగులు 10 రోజులుగా చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమం గురువారం కొనసాగింది. నగర శివారుల్లోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డునుంచి వర్శిటీ అడ్మిన్‌ కార్యాలయం వరకూ ఉద్యోగులు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్శిటీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె కాశీనందేశ్వరరావు మాట్లాడతూ జీవో119 ప్రకారం ఇంటి అద్దె, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సులను 12 క్యాజువల్‌ లీవు, రిటైర్‌మెంట్‌ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని,  10వ పీఆర్సీ ఫార్స్‌ల మేరకు ౖటñ ంస్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు వీడీఏతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర యునివర్సిటీల్లో అన్ని సౌకర్యాలు గత 2 సంవత్సరాలుగా అమలు అవుతున్నాయని, కానీ మన రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ  విశ్వవిధ్యాలయ టైం స్కేలు ఉద్యోగులకు సౌకర్యాలు అమలు చేయకుండా వివక్షత చూపుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 25–30 ఏళ్ల టైం స్కేల్‌పై పనిచేసి  రిటైర్‌ అయినా ,చనిపోయినా ఎటువంటి బెనిఫిట్స్‌ చెల్లించకుండా యునివర్సిటి యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ద్వజమెత్తారు. ఎటువంటి లీవు సౌకర్యాలు అమలు చేయడంలేదని, అనారోగ్యంపాలైనా పట్టించుకోవడంలేదని వాపోయారు. సమస్య పరిష్కారానికై వ్యవసాయ శాఖా మంత్రి జోక్యం చేసుకోని వెంటనే టైంస్కేల్‌ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె నిరంజన్‌కుమార్, గౌరవాధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, సంఘం సభ్యులు వర్శిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
>
మరిన్ని వార్తలు