నిలకడగా గోదారి వరద

27 Jul, 2016 23:08 IST|Sakshi
కొవ్వూరు : గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో బుధవారం 2,97,160 క్యూసెక్కులుగా నమోదైంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 8,600 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. మిగిలిన 2,88,560 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఆరుగంటలకు నీటిమట్టం 9.80 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నాలుగు ఆర్మ్‌లకు ఉన్న 175 గేట్లను 0.60 మీటర్లు పైకిఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకు నాలుగువేల క్యూసెక్కులు 
పశ్చిమ డెల్టాకు బుధవారం సాయంత్రం నుంచి  నాలుగు వేల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 693 క్యూసెక్కులు, జీఅండ్‌వీకి 272, నరసాపురం కాలువకుS 1,534, ఉండి కాలువకు 890, అత్తిలి కాలువకు 528 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.
 
 
 
 
 
మరిన్ని వార్తలు