నగ్నవీడియోలు తీసి... ఫేస్‌బుక్‌ నకిలీ ఐడీతో

27 Dec, 2015 19:29 IST|Sakshi
నగ్నవీడియోలు తీసి... ఫేస్‌బుక్‌ నకిలీ ఐడీతో

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి నగ్నవీడియోలు తీసిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ నకిలీ ఐడీతో సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అతనిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

భీమ్‌గల్ పట్టణంలో ప్రమోద్(32) అనే వ్యక్తి ఎలక్ట్రానిక్స్ షాపు నిర్వహిస్తూ, ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి యజమాని కూతురికి తెలియకుండా ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశాడు. ఇటీవల సదరు యువతికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన ప్రమోద్ యువతి పేరు మీద  ఫేస్‌బుక్ లో నకిలీ ఐడీ క్రియేట్ చేశాడు. ఆ ఐడీ ద్వారా యువతిని చేసుకోబోయే వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి నగ్న చిత్రాలు, వీడియోలు పంపించాడు.

దీనిపై యువతికి కాబోయే భర్త ఫోన్‌చేశాడు. నేను ఎటువంటి ఫోటోలు, వీడియోలు పంపించలేదని తెలిపింది. దీంతో కంగుతిన్న ఆ యువకుడు ఈ విషయం పెద్దలకు చెప్పాడు. పెద్దలందరూ కలిసి ఈ ఘటన గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడని విచారణలో రుజువైంది. పోలీసులు అతనిపై నిర్భయ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు