నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మిస్తాం

22 Apr, 2017 23:53 IST|Sakshi
నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మిస్తాం
ఏలూరు (మెట్రో) :  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి  ఇస్తామని, ప్యాకేజీలను అమలు చేసి అన్ని విధాలా  అదుకుంటామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే 29 ఇళ్ల కాలనీల పనుల ప్రగతి తీరుపై ఐటీడీఏ, గృహ నిర్మాణశాఖాధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త భూసేకరణ ప్యాకేజీ ప్రకారం నిర్ధేశించిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. పాత ప్యాకేజీ ద్వారా అయితే విశాలమైన స్థలం, భవనం, పై అంతస్తు నిర్మించుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే రూ.192 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్, సూపర్‌ బజార్, ప్రత్యేక పార్కు, చౌక డిపో, ఆరోగ్య కేంద్రం, అంగ న్‌వాడీ భవనం, పాఠశాలలు, ఇతర సౌకర్యాలు  కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో నిర్మించే 11  కాలనీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ షణ్మోహ న్‌Sను కలెక్టర్‌ ఆదేశించారు.
 
మరిన్ని వార్తలు