నిజామాబాద్‌ బాయ్‌.. బాయ్‌.. కామారెడ్డికి వెల్‌కమ్‌..

10 Oct, 2016 23:24 IST|Sakshi
నిజామాబాద్‌ బాయ్‌.. బాయ్‌.. కామారెడ్డికి వెల్‌కమ్‌..
 
• నిజామాబాద్‌ జిల్లా నుంచి విడిపోయి కొత్త జిల్లాగా కామారెడ్డి..
• కామారెడ్డివాసుల కళ నిజమైన వేళ
• ఇందూరు జిల్లా చరిత్రలో కామారెడ్డి ప్రత్యేకం
• విడిపోయినా కలిసి ఉంటామంటున్న ప్రజలు
• నాటి చరిత్ర గతం.. నేటి మార్పులు ప్రత్యేకం..
దశాబ్దాల ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి మరి కొన్ని గంటల్లో కామారెడ్డి జిల్లా వేరుపడనుంది.. దసరా రోజునే జిల్లాగా రూపాంతరం చెందనుంది..! ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత ఆరు దశాబ్దాలపాటు కలిసిమెలిసి ఉన్నాం.. కష్టసుఖాలు అధిగమించాం.. ఉద్యమాల్లో పాలుపంచుకున్నాం.. సింగూరు జలాల కోసం.. బాబ్లీ ప్రాజెక్టు పనులను ఆపడం కోసం.. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రైవేటు కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం కోసం.. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ పునర్జీవం పోయడం కోసం ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడాం.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించాం.. ఉద్యమానికి ఊపు తెచ్చాం.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాం..! ఎందరో నేతలు.. అధికారులు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అవిరళ కృషి చేశారు.. అందరికీ ధన్యవాదాలు.. తల్లి వంటి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి విడిపోతున్నందుకు బాధగా ఉంది.. కానీ.. కొత్త జిల్లాలో.. కొత్త ఆలోచనలతో రెండు జిల్లాలు ప్రగతి పథంలో పయనించాలని ఆశిద్దాం.. 
                                                                                                       – నిజామాబాద్‌ అర్బన్‌/కామారెడ్డి/బాన్సువాడ  
మరిన్ని వార్తలు