నిజామాబాద్‌ జిల్లాలో తొలి, చివరి రోజు!

10 Oct, 2016 23:57 IST|Sakshi
నిజామాబాద్‌ జిల్లాలో తొలి, చివరి రోజు!
బాన్సువాడ:
నిజామాబాద్‌ జిల్లా నేటితో రెండు జిల్లాలుగా మారనుంది. కొత్త జిల్లాగా కామారెడ్డి ఏర్పడనుంది. అయితే, సోమవారం పుట్టిన పిల్లలందరికీ ఆ రోజు చారిత్రాత్మకం కానుంది. సోమవారం జన్మించిన పిల్లలకు ఇచ్చే బర్త్‌ సర్టిఫికెట్‌లో నిజామాబాద్‌ జిల్లాగానే ఉంటుంది. అంటే ఒక్క రోజు నిజామాబాద్‌లో ఉండి, మిగతా జీవిత కాలం మొత్తం కామారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. నిజామాబాద్‌ జిల్లాలో ఇదే తొలి, చివరి రోజు కావడంతో ఆ రోజు వారికి మరుపురాని రోజుగా మిగులనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో సోమవారం సుమారు 200లకు పైగా పిల్లలు పుట్టారని అంచనా. అలాగే మంగళవారం పుట్టే పిల్లలకు కామారెడ్డి జిల్లా బర్త్‌ సర్టిఫికేట్‌ లభిస్తుంది. దీంతో సోమ, మంగళవారాల్లో జన్మించిన పిల్లలకు ఈ రెండ్రోజులుగా ప్రత్యేక రోజులుగా మారనున్నాయి.

గుర్తుండిపోయే రోజు: అర్షియా, తిర్మలాపూర్‌
సోమవారం నాడు బాబు పుట్టాడు. నిజామాబాద్‌ జిల్లాలో పుట్టాడు కనుక నిజామాబాద్‌ జిల్లా పేరుతో బర్త్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలోకి అడుగు పెడతాడు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. 
మరిన్ని వార్తలు