ఖాతాలో లెక్క.. చేతికి దక్కేదెలా?

11 Apr, 2017 22:36 IST|Sakshi
ఖాతాలో లెక్క.. చేతికి దక్కేదెలా?
అనంతపురం: బ్యాంక్‌ ఖాతాలో నిండుగా లెక్క ఉన్నా.. జనం చేతికి అందడం లేదు. ఆటోమేటిక్‌ టెల్లర్‌ మిషన్‌ (ఏటీఎం)లపైనే ఇంత కాలం ఆధారపడి నగదు విత్‌ డ్రా చేసుకున్న జిల్లా వాసులు నగదు కొరత కారణంతో  సరికొత్త ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న గ్రామీణ ప్రజలు సైతం ఇంతకాలం నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ల కన్నా తొలి ప్రాధాన్యత ఏటీఎం కేంద్రాలకే ఇస్తూ వచ్చారు. అయితే ఐదు నెలల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనం నగదు కష్టాలు రెట్టింపయ్యాయి.

అవన్నీ తాత్కలికమే... పరిస్థితి కొన్ని రోజుల్లో సర్దుకుంటుందంటూ చెప్పుతూ వచ్చిన పాలకులు ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై పెదవి విప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న 30 శాతం ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు నగదు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. నగదు కోసం బ్యాంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండలేక ప్రజల్లో అసహనం తలెత్తుతోంది.
మరిన్ని వార్తలు