విలీన మండలాలు అంతర్భాగం కాదా?

10 Apr, 2017 12:33 IST|Sakshi
పోలవరం నిర్వాసితుల పోరు సభలో నేతల మండిపాటు 
గిరిజనుల సమస్యలు పట్టని ప్రభుత్వంపై ఆగ్రహం
సాక్షి, రాజమహేంద్రవరం : పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి విలీనమైన కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక, చింతూరు మండలాలను రాష్ట్రంలో అంతర్భాగం కాదన్నట్లుగా సర్కారు వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితుల పోరు సభ పేరిట వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో రంపచోడరం ఎమ్మెల్యే వంత రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నేతలు నిర్వాసితుల సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఎమ్మెల్యే వంతల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో సర్వే కూడా చేయలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చే సమయంలో వయసును పరిగణలోకి తీసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి గిరిజనులకు 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం చంద్రబాబు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదని పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విలీన మండలాలను అనాధలుగా వదిలేసిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మన్యంలో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మృతి చెందినా ప్రభుత్వం ఇప్పటి వరకు కారణాలు చెప్పలేకపోతోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీయకుండా గిరిజనులకు రకరకాలుగా పరిహారం ఇస్తూ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. 2018కి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మండిపడ్డారు. 
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, యువజన విభాగం రాష్ట్ర  అధ్యక్షుడు జక్కంపూడి రాజా,   రౌతు సూర్యప్రకాశరరావు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్,  కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, డాక్టర్‌ సత్తిసూర్యనారాయణరెడ్డి, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు  పెట్టా శ్రీనివాస్, జిన్నూరి  వెంకటేశ్వరరావు, దాసరి శేషగిరి, కర్రి పాపారాయుడు,  రవివర్మ, రావు చిన్నారావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, లింగం రవి, ఎస్‌వీవీ సత్యనారాయణ చౌదరి, సుంకర చిన్ని, జిన్నూరి బాబి, దంగేటి వీరబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, అడపా శ్రీహరి, వాసిరెడ్డి జమీలు, దాసరి శేషగిరి, మురళీకృష్ణంరాజు,  రాజమహేంద్రవరం ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి అనిల్‌ షర్మిలా రెడ్డి, కార్పొరేటర్‌  బొంతా శ్రీహరి జగన్‌ వెంట ఉన్నారు.  
 
 
మరిన్ని వార్తలు