పేరుకే పెద్దాసుపత్రి

3 Aug, 2016 23:23 IST|Sakshi
  • ఇబ్బందులు పడుతున్న రోగులు
  • జగిత్యాల ఆస్పత్రి దుస్థితి
  • జగిత్యాల అర్బన్‌ : జగిత్యాల ప్రాంతంలో వర్షాకాల సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు చికిత్సల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో డెంగ్యూ, డయేరియా, విరేచనాలు, విష జ్వరాలు వస్తున్నాయి. రోగాలతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారికి మందులు సరిగా అందడం లేదు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది.
    జగిత్యాల ప్రాంతంలో ప్రజలకు వైద్యసేవలు అందించడానికి 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సర్కారు వైద్యం కోసం 14 మండలాల ప్రజలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి కూడా పేదలు ఏరియా అస్పత్రికి వస్తుంటారు. నిత్యం సుమారు 600 మంది ఔట్‌ పేషెంట్లుగా 100 నుంచి 150 మంది వరకు ఇన్‌ పేషెంట్లు గా చికిత్స పొందుతారు. వ్యాధుల సీజన్‌ కావడంతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చికిత్సకోసం ఇక్కడికి వచ్చే వారికి మందులతో పాటు  ప్లూయిడ్స్‌ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు నయం కాకపోవడంతో ప్రైవేటు అస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్‌ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి మూడు నెలలకొకసారి రూ. 7.20 లక్షల మందులను సరఫరా చేస్తారు. సీజనల్‌ వ్యాధులతో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మందులు సరిపోవడం లేదు. యాంటిబయాటిక్స్, జెంటామైసిన్, ఫ్లూయిడ్స్‌  సరిగా పంపిణీ కాకపోవడంతో వ్యాధులు నయం కావడం లేదు.
    ప్లూయిడ్స్‌ కరువు :
    వర్షాకాలంలో డయేరియా, వైరల్‌ ఫీవర్‌ ఎక్కువగా వస్తుంటాయి. చికిత్సలో భాగంగా రోగికి ముందుగా ఫ్లూయిడ్స్‌ పెడుతారు. విరేచనాలైనప్పుడు వాడే రింగర్‌ లక్టేట్‌ (ఆర్‌ఎల్‌) ఫ్లూయిడ్‌ అవసరంకాగా ఇవి ఆస్పత్రిలో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.
     
     
మరిన్ని వార్తలు