అడ్రస్ లేని రూ.500 నోట్లు

10 Apr, 2017 12:39 IST|Sakshi
అడ్రస్ లేని రూ.500 నోట్లు

పెద్ద నోట్ల రద్దు ప్రకటించి 26 రోజులవుతున్నా అగచాట్లే
ఇప్పటివరకు జిల్లాలోరూ.1000 కోట్ల మేర పంపిణీ
అరుుతే రూ.500 నోట్లు వచ్చింది మాత్రం
రూ.మూడు, నాలుగు కోట్లు మాత్రమే
రూ.100, రూ.20నోట్లు కూడా రూ.40
నుంచి రూ.50 కోట్ల మేరకే సరఫరా


సాక్షి, కడప: ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే రచ్చ.. బ్యాంకుల వద్ద నగదు దొరకక సామాన్య జనంతోపాటు ఉద్యోగులు పడుతున్న వేదన అంతా.. ఇంతా కాదు. ఒకవేళ ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అంతో.. ఇంతో నగదు లభించినా అన్నీ రూ.2000 నోట్లే వస్తుండటం అందరినీ కలవరపెడుతోంది. ప్రత్యేకంగా చిల్లర దొరకక.. ఇస్తున్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అరుుతే బ్యాంకర్లు మాత్రం రూ.100 నోట్లు ఇవ్వడానికి అవి రాలేదంటూ తిప్పి పంపుతున్నారు. పైగా జిల్లాకు రూ.500 నోట్లు రాకపోవడం కూడా ఆందోళన కలిగించే పరిణామం.

కనిపించని రూ.500 నోట్లు
జిల్లాలో ఎక్కడ చూసినా సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, వృద్ధులు, పింఛన్‌దారులు పడరాని కష్టాలు పడుతున్నారు. అరుుతే బ్యాంకులకు ఇప్పటివరకు రూ.500 నోట్లు అంతంత మాత్రంగానే రావడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది. ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాకు రూ.500 నోట్లు మూడు, నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అవి కూడా చెన్నూరు, ఇతర ఒకట్రెండు బ్యాంకులలో మాత్రమే పంపిణీ చేశారు. అరుుతే దాదాపు 26 రోజులుగా ఇప్పటివరకు సుమారు రూ.1000 కోట్ల నగదు ప్రజలకు పంపిణీ చేశారు. రూ.1000 కోట్లకు గాను.. కేవలం మూడు, నాలుగు కోట్ల రూ.500 నోట్లు మాత్రమే వచ్చారుు. అరుుతే రూ.500నోట్లు ఎందుకు రావడం లేదన్నది అర్థం కావడంలేదు. అరుుతే ఆర్‌బీఐ నుంచే జిల్లాకు రూ.500నోట్లు రావడంలేదని తెలుస్తోంది.

 రూ.100, రూ20నోట్లు కూడా రూ4.0నుంచి రూ.50కోట్లే..
జిల్లాకు సంబంధించి రూ.100, రూ.20నోట్లు కేవలం రూ.40నుంచి రూ.50కోట్ల మేర మాత్రమే వచ్చారుు. అరుుతే జిల్లా పరిస్థితి దృష్ట్యా ఎక్కువ చిల్లర అవసరం ఉన్నా.. పెద్ద నోట్లే అధికంగా వచ్చారుు. రెండు రోజుల క్రితం జిల్లాకు రూ.160 కోట్లు రాగా.. అందులో ఒక్కటి కూడా రూ.500, రూ.100, రూ.20 నోట్లు లేవు. రూ.160 కోట్ల మొత్తం అంతా కూడా రూ.2వేల నోట్లే కావడం ప్రస్తావనార్హం. చిన్న నోట్లు రాకపోవడంతో ఎక్కువ సమస్య ఎదురవుతోంది. బ్యాంకు అధికారులు రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో బయట కూడా చిల్లర దొరకక అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు చిన్న నోట్లు వస్తాయో ఎవరికి అంతు చిక్కడంలేదు. ప్రత్యేకంగా ఆర్‌బీఐ నుంచి తెప్పించుకుంటే తప్ప సమస్య తెగేట్లు లేదు.

 ఎక్కడ చూసినా చిల్లర సమస్య..
జిల్లాలో ఎక్కడ చూసినా చిల్లర సమస్య వెంటాడుతోంది. రూ.2వేల నోట్లకు చిల్లర దొరకక ఏ షాపులోకి వెళ్లినా.. ఏ హోటల్‌కు వెళ్లినా ఆర్టీసీ బస్సు ఎక్కినా ఇలా ఎక్కడ చూసినా చిల్లర దొరకక కష్టాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది రూ.2వేలకు రూ.10ల చొప్పున కమీషన్ తీసుకుంటూ చిల్లర ఇస్తున్నారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోంది. ఉన్నతాధికారులు చిల్లర సమస్యను దృష్టిలో ఉంచుకొని చిన్న నోట్లు ఎక్కువ సరఫరా అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప ఫలితం ఉండదు.

మరిన్ని వార్తలు