స.హ.చట్టంపై కొరవడిన పర్యవేక్షణ

28 Sep, 2016 23:08 IST|Sakshi
స.హ.చట్టంపై కొరవడిన పర్యవేక్షణ
స.హ.చట్టం కమిషనర్‌ తాంతియాకుమారి
 
ఉయ్యూరు :
 సమాచార హక్కు చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజలకు పూర్తి న్యాయం జరగడంలేదని రాష్ట్ర కమిషనర్‌ లాం తాంతియకుమారి అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బీ బంగళాలో బుధవారం ఆమె సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో సమీక్ష, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ కొందరు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని శత్రువుగా చూస్తూ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమ నైతికతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఆశాజనక పరిస్థితులు లేవన్నారు. ఈ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. సామాజిక కార్యకర్తలను బ్లాక్‌మెయిల్‌ర్లుగా చూపుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒకరిద్దరు చేసే తప్పులను పెద్దగా చూపి, చట్టం మొత్తాన్ని అపహాస్యం చేయడం తగదన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించేలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాస్‌ గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, అలమూడి చంద్రమోహన్, వల్లే శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తాంతియాకుమారిని సన్మానించారు.
 
మరిన్ని వార్తలు