మహిళలకు రక్షణ కరువు

8 Aug, 2016 00:14 IST|Sakshi
మహిళలకు రక్షణ కరువు
గన్నవరం :
 రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినా, పాలకులు తారతమ్యాలు చూపిస్తూ మహిళలకు విలువ లేకుండా చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. పురుషులతో సమానంగా రాణిస్తునప్పటికీ మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. స్థానిక శ్రీమల్లికార్జున హైస్కూల్‌లో రెండురోజులు నిర్వహించే ఐద్వా రాష్ట్ర స్తృత స్థాయి సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సంఘ పతాకాన్ని ఐద్వా సీనియర్‌ నాయకురాలు యర్లగడ్డ జోయా ఆవిష్కరించారు. సంఘ వ్యవస్థాపకురాలు మానికొండ సూర్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రమాదేవి మాట్లాడుతూ మహిళా చట్టాలను పాలకులు నీరుగారుస్తూ, రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్త్రీ, పురుషుల నిష్పత్తిని సమానం చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధాసుందర్‌రామన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, మాధవి, లక్ష్మి, శ్రీదేవి, జిల్లా కార్యదర్శి పిన్నమనేని విజయ, డివిజన్‌ కార్యదర్శి మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు