కుక్కకాటు బాధితుని హాహాకారాలు

17 Jul, 2016 18:56 IST|Sakshi
24 గంటల పీహెచ్‌సీలో కానరాని సిబ్బంది
 
బలిజిపేట రూరల్‌: కుక్కకాటు బాధితుడు వైద్యం కోసం బలిజిపేట పీహెచ్‌సీకి వస్తే సిబ్బంది లేకపోవడంతో విలవిల్లాడిపోయాడు. బాధితుడు భాస్కరరావు ఆదివారం ఉదయం పీహెచ్‌సీకి ఉదయం 10గంటల 30 నిమిషాలకు వచ్చాడు. 24 గంటల పీహెచ్‌సీ అయినప్పటికీ సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఉదయం 11గంటలవుతున్నా ఎవరూ రాకపోవడం, కుక్కకాటు గాయం బాధపెడుతుండటంతో కలవరపడ్డాడు. పేరుకు 24గంటల పీహెచ్‌సీ అయినా వైద్యాధికారి సహా, మిగిలిన సిబ్బంది అందుబాటులో లేరు. రెగ్యులర్‌ స్టాఫ్‌నర్స్‌ సెలవులో ఉన్నందున వేరొకరు విధులు నిర్వహించాల్సి ఉంది. రెండో స్టాఫ్‌నర్స్‌ 11 గంటలు దాటాక వచ్చి వైద్యం చేశారు. జ్వరంతో బాధపడుతున్న మరో రోగి కూడా ఆస్పత్రిలో నిరీక్షించాల్సి వచ్చింది. కంటింజెంట్‌ వర్కరు మాత్రమే పీహెచ్‌సీలో విధుల్లో ఉండటంతో రోగులు ఇబ్బంది పడ్డారు. 
మరిన్ని వార్తలు