కరుణించు తండ్రీ..

8 Sep, 2016 01:05 IST|Sakshi
కరుణించు తండ్రీ..

పుట్లూరు : కరువుతో జనం కష్టాల్లో ఉన్నారు. అయినా చవితి పండుగ నాడు నాకు ఏ లోటూ చేయలేదు.     కడుపారా ఉండ్రాళ్లు పెట్టారు. వారి స్తోమతను బట్టి  విగ్రహాలను కొలువుదీర్చారు. ఆటపాటలతో నన్ను అలరించారు. వారి కన్నీటి కష్టాలను దాచిపెట్టుకుని.. నన్ను మాత్రం కన్నబిడ్డలా ఆదరించారు. అంతే ఆదరణతో గంగమ్మ ఒడికి చేర్చాలని తపన పడ్డారు. అయితే.. చెరువులు, వాగులు, వంకలు ఇలా ఎక్కడ వెతికినా గంగమ్మ ‘తల్లి’ జాడ కన్పించలేదు. పాపం..! ఇక వారు ఇంతకన్నా ఏం చేయగలరు?! అందుకే నన్నిలా వదిలివెళ్లారు. తండ్రీ.. కరుణించు! గంగమ్మను పంపి..జలకళను ప్రసాదించు! నీ బిడ్డను ఆదరించిన ఈ జనం రుణం కొంతైనా తీర్చుకో!            

 

 

మరిన్ని వార్తలు