ఖేడ్ మళ్లీ ‘నామినేటెడ్’ పైరవీలు షురూ!

6 Mar, 2016 01:51 IST|Sakshi
ఖేడ్ మళ్లీ ‘నామినేటెడ్’ పైరవీలు షురూ!

‘బుగ్గ కారు’ రేసులో ఆరుగురు ఎమ్మెల్యేలు
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గం
సీఎం ప్రకటనతో ఆశావహుల్లో సందడి
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యత

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నామినేటెడ్ పోస్టులపై ఆశావహుల్లో సందడి మొదలైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం రంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నారుు. నామినేటెడ్ పోస్టుల్లో ఎంపికలకు సంబంధించి పరిశీలన తరువాయిగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అనుచరులకు పోస్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలోనే కొత్త పాలకవర్గాలను నియమించనున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విజయదశమి సందర్భంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగినా.. వరంగల్ పార్లమెంట్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, నారాయణ్  నియోజకవర్గాలకు ఎన్నికలు జరగడంలో ఆల స్యం అరుుంది. తాజాగా కేసీఆర్ ప్రకటనతో మళ్లీ పైరవీలు మొదలయ్యూరుు. జిల్లా అధ్యక్షు లు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పదవులను కట్టబెట్టనుం డగా.. ఆయా పదవుల కోసం పోటీ పడుతున్న నాయకుల వివరాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రస్థాయి చైర్మన్ రేసులో ఆరుగురు
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ సారి ఖాయమన్న సంకేతాలు బలంగా రావడంతో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కాగా 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులతోపాటు, అప్పుడు టికెట్ కోసం ప్రయత్నించి.. అధిష్టానం బుజ్జగింపులతో వైదొలగిన నేతలు ఇప్పుడు రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ కోసం కూడా పోటీపడి రాజీపడిన నాయకులు పోటీ పడుతుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇంతకు ముందున్న ఆర్టీసీ, ఆగ్రోస్‌లకు తోడు ఈ సారి మిషన్ భగీరథ తదితర పథకాలకు రాష్ర్టస్థాయిలో శాసనసభ్యులను చైర్మన్‌లుగా నియమించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించిన నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, బాల్కొండ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్త, హన్మంత్‌షింథే, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవిందర్‌రెడ్డిలు రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది.

సీఎం కేసీఆర్ చేపట్టిన అయిత చండీయాగం ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేరు మిషన్ భగీరథ(వాటర్‌గ్రిడ్) చైర్మన్‌గా ఇప్పటికే ఖరారయ్యిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఎవరికీ తోచిన విధంగా వారు ప్రయత్నాలు చేస్తుండగా.. రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు జిల్లాకు రెండు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రెండిస్తారా? ఒకటిస్తారా? అనే చర్చ పక్కన బెడితే ఈ సారి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ‘బుగ్గకారు’ ఎవరెవరిని వరిస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మాజీ మార్‌‌కఫెడ్ డెరైక్టర్  మునిపెల్లి సాయరెడ్డి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అనేక పదవులు చేపట్టిన ఈయన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డి.శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీస్సులతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

 కార్పొరేషన్ చైర్మన్లు, డెరైక్టర్లు, మార్కెట్ కమిటీలు కావేవీ అనర్హం..
మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలు ఆర్టీసీ, ఆగ్రోస్, గ్రంథాలయ తదితర రాష్ర్టస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్, డైరక్టర్ పదవులు.. మార్కెట్ కమిటీ చైర్మన్లు తమకు కావేవీ అనర్హం అంటున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కోసం పలువురు సీనియర్లకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్‌ల నుంచి టికెట్ ఆశించిన డాక్టర్ భూపతిరెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బోధన్‌కు చెందిన గిర్దావర్ గంగారెడ్డి, వేముల సురేందర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు. కాగా జిల్లాలో ఇదివరకు 12 ఉన్న మార్కెట్ కమిటీల సంఖ్య 17కు చేరగా.. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, పిట్లం, గాంధారి తదితర వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లుగా, డైరక్టర్ల కోసం ప్రతిపాదనల తయారీలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఇదివరకే ప్రతిపాదించినా... తాజాగా మరోసారి జాబితాను పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఏ మార్కెట్ కమిటీకి ఎవరెవరు పోటీ
♦  జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా ఆయా ప్రాంతాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల కోసం స్థానిక నేతలు పోటీ పడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ అ తి పెద్దది దీనికి నిజామాబాద్ అర్బన్‌లోని టీఆర్‌ఎస్ సీనియర్, పొలిట్‌బ్యూరో సభ్యు డు ఎ.ఎస్.పోశెట్టి, మరో కార్యకర్త ఆదె ప్రవీ ణ్ పోటీపడుతుండగా, ప్రస్తుత టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కూడా మా ర్కెట్ కమిటీని ఆశిస్తున్నారు. అంతేకాకుం డా ఎంపీ కవిత వియ్యంకుడు రాంకిషన్‌రా వు పోటీలో ఉండగా ఈ మార్కెట్ కమిటీ రి జర్వేషన్ బీసీకి రావడంతో వీరు తప్పుకున్నారు. మరోవైపు మానిక్‌భండార్‌కు చెంది న ఆకుల రజినేష్‌కు మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కట్టబెట్టే ప్రయత్నం పూర్తి అయినట్లు సమాచారం.

ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ రేసులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మిట్టప ల్లి గంగారెడ్డి, యామాద్రి భాస్కర్, మోహన్ ఉన్నారు. మిట్టపల్లి గంగారెడ్డి టీఆర్‌ఎస్ పా ర్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షునిగా, యా మాద్రి భాస్కర్ ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారాల ఇన్‌చార్జీగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోహన్ టీఆర్‌ఎస్ పార్టీ గ్రా మ స్థాయి నాయకునిగా ఉన్నాడు. ఎన్నికల సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఆశించి పార్టీలో చేరిన వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రస్తుతం తెరపైన ప్రధానంగా ఈ ముగ్గురు మాత్రమే చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్నారు.

బోధన్ నియోజకవర్గంలోని మార్కెట్ కమి టీ రేసులో సీఎం కేసీఆర్ వియ్యంకుడు రాంకిషన్‌రావు, ఎంపీ కవితలకు సన్నిహితుడిగా ఉన్న జి.శ్యాంరావు, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ను ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకున్న అబ్దుల్ కరీం, ఎమ్మెల్యే షకీల్ అతి స న్నిహితుడు, బోధన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో డెరైక్టర్ శరత్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు.

బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ పరిధిలో కమ్మర్‌పల్లి, మో ర్తాడ్, భీమ్‌గల్ మండలాలు ఉన్నాయి. ఈ కమిటీ చైర్మన్ పదవిని బీసీలకు రిజర్వు చే శారు. కమ్మర్‌పల్లి మండలానికి చెందిన టీ ఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు లుక్క గంగాధర్‌తోపాటు ఉప్లూర్ సర్పంచ్ భూదేవి భర్త రేగుం ట దేవెందర్, భీమ్‌గల్ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్యలు చై ర్మన్ పదవి రేసులో ఉన్నారు.

కామారెడ్డి మార్కెట్ కమిటీ బీసీలకు రిజ ర్వు అయ్యింది. నిట్టు వేణుగోపాల్‌రావ్, పు న్న రాజేశ్వర్, జి.గోపిగౌడ్ పోటీలో ఉన్నా రు. భిక్కనూరు మార్కెట్ కమిటీ జనరల్ రి జర్వుడ్ అయింది. అందె మహేందర్‌రెడ్డి, మల్లేశ్ మల్లారెడ్డి, నాగర్తి భూంరెడ్డి, అమృతారెడ్డి పోటీలో ఉన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో మూడు మార్కె ట్ కమిటీలు ఉన్నాయి. ఒకటి బిచ్కుంద, పి ట్లం, కొత్తగా జుక్కల్‌లో ఏర్పాటు చేశారు. బిచ్కుంద మార్కెట్ కమిటీ రేసులో టీఆర్‌ఎ స్ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీహరి, పిట్లం మార్కెట్ కమిటీ ఆశిస్తున్న వారిలో టీఆర్‌ఎ స్ జిల్లా నాయకుడు అన్నారం వెంకటరామ్‌రెడ్డి, కొత్తగా ఏర్పడిన జుక్కల్ మార్కెట్ క మిటీలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు టీఆర్‌ఎస్ మండల నాయకుడు సాయగౌడ్ బరి లో ఉన్నారు. వీరు హన్మంత్ సింధే ముఖ్య అనుచరులు.

ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. చైర్మన్ పదవిని ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయపల్లికి చెందిన వెంకట్‌రెడ్డితోపాటు ఇదే మండలానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణగౌడ్, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలానికి చెం దిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఆశి స్తున్నారు. కానీ, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి చైర్మ న్ పదవికి వెంకట్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. గాంధారి మార్కెట్ కమిటీకి బెజుగం సంతోష్, సీతాయిపల్లి పంచాయతీ పరిధిలోని చెన్నపూర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, గౌరారం పంచాయతీ పరిధి లో గల సర్వాపూర్‌కు చెందిన సత్యం పోటీ పడుతున్నారు. నూతనంగా సదాశివనగర్ లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సదాశివనగర్‌లో మార్కెట్ కమిటీ కార్యాల యాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో చైర్మన్ పదవిని తాడ్వాయి మండల వాసులకు కే టాయిస్తున్నట్లు తెలిసింది. వైస్ చైర్మన్ పదవిని సదాశివనగర్  మండలానికి కేటాయిస్తారని సమాచారం. కాగా చైర్మన్ పదవికి తా డ్వాయి మండలానికి చెందిన శ్యాంరావుతోపాటు కృష్ణమూర్తి, సాగర్, గోపాల్‌రావు రే సులో ఉన్నారు. వీరిలో ఒకరి పేరును ఎమ్మె ల్యే రవీందర్‌రెడ్డి ఖరారు చేయనున్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ మార్కెట్ కమిటీకి నార్ల సురేష్, బీర్కూర్‌కు పెర్క శ్రీనివాస్, కోటగిరికి శంకర్‌పటేల్, వర్నికి నారోజీ గంగారాం పోటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు