నిబంధనలు పాటించకపోతే బ్లాక్‌లిస్ట్‌

28 Oct, 2016 23:01 IST|Sakshi
నిబంధనలు పాటించకపోతే బ్లాక్‌లిస్ట్‌
కోల్డ్‌ స్టోరేజీ యజమానులకు
మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ హెచ్చరిక
 
గుంటూరు (కొరిటెపాడు): అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని కోల్డ్‌స్టోరేజీలను బ్లాక్‌లిస్టులో పెట్టి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ పి.మల్లికార్జునరావు స్పష్టం చేశారు. స్థానిక చుట్టుగుంటలోని మార్కెటింగ్‌ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్ల వ్యవధిలో ఏడు శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలపై నియంత్రణ లేదనే అపోహ వుందని, దానిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కోల్డ్‌స్టోరేజీలకు ప్రత్యేక లైసెన్సు విధానం తీసుకురావడానికి కొలతలు తయారు చేయాలని సూచించారు.
 
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారుల నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ)లు క్రోడీకరించి ప్రతి ఏడాది లైసెన్సును రెన్యువల్‌ చేసేలా చూస్తామని, ఈ మూడు కంటిన్యుటీ లేకపోతే స్టోరేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్సు ధ్రువీకరణ పత్రానికి రాకపోతే బ్లాక్‌లిస్టులో పెడ్తామన్నారు. ప్రమాదాల నివారణకు  పూర్తి కొలతలతో ప్రొఫార్మాను తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన శనివారం మధ్మాహ్నం 12 గంటలకు కోల్డ్‌స్టోరేజీల్లో ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి సీసీ కెమెరాలు, కార్బన్‌డైఆకై ్సడ్‌(నిప్పును ఆర్పేది), డ్రై  స్ప్రింక్లర్స్‌ ఏర్పాటు, లక్ష లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు.
మరిన్ని వార్తలు