ధార్మిక సదస్సుపై పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు

16 Dec, 2015 10:58 IST|Sakshi
ధార్మిక సదస్సుపై పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల ధార్మిక సదస్సుపై శారదా పీఠాధిపతి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు విచ్చేసిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సు కంటితుడుపు చర్య మాత్రమేనని విశాఖపట్టణం శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరుపానందేంద్ర సరస్వతీ వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ధార్మిక సదస్సు కార్యక్రమానికి టీటీడీ నుంచి గాని, హిందూ ధార్మిక ట్రస్ట్ నుంచి గానీ తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. అందుకే తాను ఆ సదస్సుకు రాలేదని వివరించారు.

పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలు పాటించకుండా ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహణ వ్యర్థమని స్వరుపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆలయాలు నిర్మించడం అదనపు భారమని టీటీడీ భావిస్తుందన్నారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 2న తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సులో 40 మందికి పైగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక వేత్తలు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు