నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు

14 Dec, 2016 22:53 IST|Sakshi
నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు

వెలుగోడు: నోట్ల మార్పిడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు బుధవారం వెలుగోడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఈ నెల 9న నోట్లు మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఆత్మకూరు పోలీసులకు ఇద్దరు సభ్యులు పట్టుబడ్డారు. వీరిలో సంజీవగౌడ్, రవితేజారెడ్డి ఉన్నారు. మిగిలిన ప్రసాద్,  సుధాకర్‌ పరారీలో ఉండగా, వారు బుధవారం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్‌ఐ వివరించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డి, ఆంజనేయులును అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు