ఎన్నారై టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్ ఆవిష్కరణ

27 Apr, 2016 00:29 IST|Sakshi
ఎన్నారై టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్ ఆవిష్కరణ

- జూన్ 4న మెల్‌బోర్న్‌లో ఆవిర్భావ సభ
రాయకల్(కరీంనగర్ జిల్లా): ఎన్నారై టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ శానబోయిన, కార్యదర్శి నవీన్‌రెడ్డి, ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బెరైడ్డి, అధికార ప్రతినిధి నాగేందర్ కాసర్ల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన మెల్‌బోర్న్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖను ఎంపీ కవిత ప్రారంభిస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు