వైఎస్సార్‌ సీపీలో చేరిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు

29 Sep, 2016 21:49 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీలో చేరిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
 
గుంటూరు (పట్నంబజారు) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్‌తేజ పార్టీలో చేరారు. గుంటూరు నగరానికి చెందిన పవన్‌తేజ కాంగ్రెస్‌ పార్టీలో విద్యార్థి దశ నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ విభాగాల్లో పనిచేశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గురువారం నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్‌తేజకు జగన్‌ కండువా కప్పి స్వాగతం పలికారు. పవన్‌తేజ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టత కోసం పాటుపడతానని చెప్పారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేపడతామని తెలిపారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు