ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతనానికి కృషి

1 Jan, 2017 22:38 IST|Sakshi
ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతనానికి కృషి

►  ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధానకార్యదర్శి సీహెచ్‌. ఉపేందర్‌

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉద్యోగులకు మెరుగైన వేతన ఒప్పందం అందించేందుకు కృషి చేస్తామని ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్(ఉద్యోగ గుర్తింపు సంఘం) ప్రధానకార్యదర్శి సీహెచ్‌. ఉపేందర్‌ అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్‌ టౌన్ షిప్‌లోని జ్యోతిక రిక్రియేషన్ క్లబ్‌ మ్యూజిక్‌ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి–2017 నుంచి నూతన వేతన ఒప్పందం అమలు కాబోతున్నదన్నారు. జస్టీస్‌ సతీష్‌ చంద్ర నాయకత్వంలోని పీఆర్‌సీ కమిటీ సిఫారసుల నివేదికను ప్రభుత్వానికి అందజేసిన అనంంతరం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తర్వాత ఉద్యోగులకు వేతన సవరణ జరుగనున్నదని వెల్లడించారు. 

చార్డెడ్‌ ఆఫ్‌ డిమాండ్‌్సను జనవరి–29న కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరుగనున్న కేంద్ర కార్మిక సంఘాల జాతీయసదస్సులో చర్చిస్తామన్నారు. గ్రాట్యుటీని 20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మెరుగైన వేతనం ఉద్యోగులకు అందించేందుకు మహారత్న ఎన్టీపీసీ సంస్థ ముందుకురావాలన్నారు.  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉదయ్‌కుమార్, గోపాల్‌రెడ్డి, కిషన్ రావు, రాజాగౌడ్, కోట మల్లేష్, మొగురం గట్టయ్య, ఇంద్రాచారి, కొమ్ముగోపాల్, సారయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు