కళార్చనకు వేళాయే!

11 Sep, 2016 22:31 IST|Sakshi
కళార్చనకు వేళాయే!
ఒంగోలు : ఎన్‌టీఆర్‌ కళాపరిషత్‌–2017లో జరిగే కళార్చనలో ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్న కళాకారులు అక్టోబర్‌ 31వ తేదీలోగా వివరాలను అందజేయాలని సంస్థ చైర్మన్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పద్య నాటక పోటీలతో పాటు గద్య నాటిక పోటీలను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. గద్య నాటక పోటీల్లో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక ఇతివృత్తాలతో ప్రదర్శనలను ఎంపిక చేసుకోవాలని, వాటిలో పద్యాలు ఉన్నా లేకున్నా నటన, అభినయానికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
 
వాటితో పాటు గతంలోలా సాంఘిక నాటకాలు, నాటికలు ఉంటాయన్నారు. ప్రదర్శనకు ఎంపికైన ప్రతీ నాటకానికి రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.25 వేల నగదు పారితోషికాలు ఇస్తామన్నారు. ప్రేక్షకాదరణ పొందిన ఉత్తమ ప్రదర్శనకు విభాగం ఆధారంగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.25 వేలు చొప్పున బహుమతులు ఇస్తామని ఈదర వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ కళాపరిషత్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ యజం్ఞ అనితర సా««దl్యమని అభివర్ణించారు. ప్రదర్శనలు ప్రజలకు మంచి సందేశం ఇచ్చేలా ఉంటే మంచిదన్నారు.
 
  ప్రవేశ రుసుం 911010028601537 (యాక్సిస్‌ బ్యాంకు–ఒంగోలు–ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ్ఖఖీఆ0000293కు ఆన్‌లైన్‌లో చెల్లించాలని,  సూచించారు. ప్రవేశ పత్రాలను అక్టోబర్‌ 31వ తేదీలోగా  పంపాలన్నారు. పూర్తి వివరాల కోసం అన్నమనేని ప్రసాదరావు (9347505277), జుజ్జూరి వెంకట్రావు (9949722654), గాండ్ల శ్రీనివాసరావు (8143267539)లను సంప్రదించాలని పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు