ప్రశాంతంగా నర్సింగ్‌ పరీక్షలు

15 Sep, 2016 19:52 IST|Sakshi
ప్రశాంతంగా నర్సింగ్‌ పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వ, ప్రై వేటు నర్సింగ్‌ పాఠశాలల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కర్నూలు మెడికల్‌ కాలేజీలోని ఆడిటోరియంలో ఈ నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 24 వరకు నిర్వహిస్తారు.  జిల్లాలో మొత్తం 13 పాఠశాలల నుంచి 2,959 మంది విద్యార్థినులు పరీక్షలు రాస్తున్నారు. గురువారం ఎంఎస్‌–వన్‌ పరీక్షను ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు రాశారు. పరీక్షల చీఫ్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి, చీఫ్‌ ఎగ్జామినర్‌గా సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ వై.శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు 21 మంది ఇన్విజిలేటర్లు పరీక్షను పర్యవేక్షిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు