నర్సింగ్‌ సీట్లు ఈ ఏడాది లేనట్టే !

1 Oct, 2016 00:06 IST|Sakshi
నర్సింగ్‌ సీట్లు ఈ ఏడాది లేనట్టే !
  • సిబ్బంది కొరతే ప్రధాన కారణం 
  • కళాశాల నిర్వహణపై ఐఎన్సీ అసంతృప్తి
  • సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు 
  •  
    ఎంజీఎం :  వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల పరిధిలోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల నిర్వహణపై ఇండియ¯ŒS నర్సింగ్‌ కౌన్సిలింగ్‌(ఐఎన్సీన్) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఏడాది సీట్ల భర్తీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నర్సింగ్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రార్‌ ఐదు రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేయడంతో సీట్ల ను కాపాడుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులతో  కలిసి ఢిల్లీలోని ఐఎన్సీ బృందం వద్దకు పయనమయ్యారు. ఇం డియన్ నర్సింగ్‌ కౌన్సిలింగ్‌ సభ్యులు ప్రతి సంవత్సరం కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సరిపడా అధ్యాపక బృందంతో పాటు హాస్టల్‌ వసతి, లైబ్రరీ వంటి సౌకర్యాలను పరిశీలిస్తారు. 
     
    వారు సంతృప్తి చెందితేనే అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. 2012లో కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. అంతేకాక ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడి నుంచి విద్యార్థులకు కళాశాలకు నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా నర్సింగ్‌ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు మెస్‌ సౌకర్యం సరిగ్గా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల విద్యార్థులు అడ్మిషన్లు పొందగా,  ఐదుగురు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. కళాశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఐఎన్సీ నిబంధనల ప్రకారం పది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఇక్కడ ఐదుగురు మాత్రమే ఉండడంతో ఐఎన్సీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి,  సీట్ల అనుమతికి నిరాకరించారని  అధ్యాపకులు చెపుతున్నారు. ఫ్యాకల్టీ నియామకం గురించి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని నర్సింగ్‌ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలపై దృష్టి పెట్టి సీట్లను కాపాడడడంతో పాటు వెంటనే అధ్యాపకులను నియమించాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.   
మరిన్ని వార్తలు