రోడ్డు ప్రమాదంలో నర్సింగ్‌ విద్యార్థిని మృతి

1 Nov, 2016 00:08 IST|Sakshi
కర్నూలు(హాస్పిటల్‌): రోడ్డు ప్రమాదంలో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని మృతి చెందింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్ననూరు గ్రామానికి చెందిన ముత్యాలు కుమార్తె పి. లింగమ్మ(19) కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజిలో బిఎస్సీ నర్సింగ్‌ కోర్సు మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె నగరంలోని గిరిజన హాస్టల్‌లో ఉంటోంది. ఇదే హాస్టల్‌లో ఆమెకు తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని బి. సుజాత పరిచయమైంది. ఆదివారం ఆమె సుజాత ఊరికి వెళ్లేందుకు గుత్తికి వెళ్లింది. అక్కడ నుంచి బైక్‌పై ఆమెను సుజాత సోదరుడు ఎం. స్వామినాయక్‌తో కలిసి వెళ్లారు. మార్గమధ్యంలో జొన్నగిరి గ్రామం వద్ద స్పీడ్‌బ్రేకర్‌ రావడంతో అదుపు తప్పి బైక్‌పై నుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు