బోటు నుంచి పర్యవేక్షణ

21 Aug, 2016 20:14 IST|Sakshi
బోటు నుంచి పర్యవేక్షణ
ఐజీ సంజయ్‌ ఘాట్‌ల పరిశీలన 
 
గుంటూరు రూరల్‌ (అమరావతి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే స్నానపు ఘాట్‌లను ఐజీ సంజయ్‌ ఆదివారం బోట్‌ ద్వారా ప్రయాణిస్తూ పరిశీలించారు. తాళ్ళాయపాలెం ఘాట్‌నుంచి బయలుదేరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని స్నానపు ఘాట్‌లను ఆయన పరిశీలిస్తూ అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళాయపాలెంనుంచి అమరావతి వరకూ ఉన్న ప్రతి ఘాట్‌ను పరిశీలించానని కొన్ని ప్రాంతాల్లో స్నానాలకు అనువుగాని చోట ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తాళాయపాలెంనుంచి అమరావతి ఘాట్‌వరకూ సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉండడం, తగిన రక్షణ చర్యలు ఉండడంవల్ల భక్తులు ఆనందంగా స్నానాలు ఆచరిస్తున్నారన్నారు.
 
 
 
>
మరిన్ని వార్తలు