బ్రహ్మగుండం ..క్షుద్ర నిలయం

27 Jul, 2016 00:25 IST|Sakshi
బ్రహ్మగుండం ..క్షుద్ర నిలయం

–నాడు రవ్వల కొండ.. నేడు పులికుంట
–మహిళలు, పిల్లలే టార్గెట్‌
–కోట్లకు పడగలెత్తిన మంత్రగాళ్లు

 
ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మంత్రగాళ్లు. మంత్రాలు, అంత్రాలు, క్షుద్రపూజలతో ఏ సమస్యనైనా తీరుస్తామని చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రవ్వలకొండ ప్రాంతంలో గూడూరు చిన్నమద్దమ్మ, ఎర్రకత్వ ప్రాంతంలో ఆమె కూతురు లక్ష్మిల హత్యోదంతం క్షుద్రపూజలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో క్షుద్రపూజలపై కథనం..
 వెల్దుర్తి రూరల్‌ :  క్షుద్రపూజలు, చేతబడులకు పట్టణ సమీపంలోని బ్రహ్మగుండం ఆలయ పరిసరాలు అడ్డాగా మారాయి. జనసంచారం తక్కువగా ఉండడంతో మంత్రగాళ్లకు పని సులవవుతోంది. బ్రహ్మగుండం పరిసరాలైన రవ్వలకొండలో కొనసాగుతున్న  క్షుద్రపూజలు ఆ ప్రాంత రైతులు అభ్యంతరం తెలపడంతో  పక్కనే ఉన్న పులికుంట సమీపంలోకి మార్చారు. ఇక్కడ చెట్లు, పాతకోనేరు ఎదురుగా పార్వతీదేవి ఆలయం, పక్కనే నీటి వసతి ఉండడంతో మంత్రగాళ్లకు కలసివస్తోంది.
బలహీనతే పెట్టుబడి..
మండలానికి చెందిన ఇద్దరు క్షుద్రపూజలు చేసేవారిలో మొదటి వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. వీరు మొదట తమ గ్రామాల్లోని ఆలయాల వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని తమ పని మొదలెడతారని. వీరి అనుంగు శిష్యలైన ఒక మహిళ, మరొకతను ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరే బాధితులకు ఫలానా పూజలు నిర్వహించాలని, ఇంత మొత్తం ఖర్చువుతుందని నిర్ణయిస్తారని తెలుస్తోంది. గాలి సోకిందని, దయ్యం పూనిందని, చేతబడి జరిగిందని, కుటుంబ కలహాలతో  ఇతరులను వశం చేసుకోవడానికని వచ్చిన మహిళలకు మంగళ, ఆదివారం, అమావాస్య రోజుల్లో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు సమాచారం.
క్షుద్రపూజలు ఇలా..
 బాధిత మహిళలు, చిన్నారులను పులికుంటలో(నీరుంటే)  లేకపోతే వాటర్‌ హౌస్‌ పక్కనున్న గచ్చులో అభ్యంగ స్నానాలు చేయించి తడి బట్టలతో తాము పూజలకు సిద్ధం చేసుకున్న రతి(కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వగైరాలతో వేసిన పిండి ముగ్గులు)లో దీపాలు వెలిగించి మధ్యలో కూర్చోబెడతారు. విపరీతమైన శబ్దాలతో  దెయ్యం పారదోలుతున్నామంటూ వారిని స్పహ కోల్పేయే వరకు చెర్నకోలాలతో కొడతారు. అనంతరం వారి ఒంటిపై ఉన్న నగానట్రా తీసేసుకుని, వస్త్రాలు, చెప్పులతో సహా వాటిని మంటల్లో కాల్చి కొత్త వస్త్రాలను ధరింపజేస్తారు. జుట్టు, ఒంటిపై ఉన్న వస్త్రాన్ని కత్తిరించి వాటిని చెట్టుకు కడతారు. బలి అంటూ నల్లకోడిని కోసి రక్తం ఒక గిన్నెలో పోసి పూజ ముగిస్తారు. వారితో వచ్చిన వారికి ఇక బాగవుతుందని చెబుతూ  కోడి రక్తాన్ని వారి ఇళ్లప్రాంతాలలో చల్లుకోవాలని, కోడి మాంసాన్ని పచ్చిగా ఆరగించమంటారు.  క్షుద్ర పూజల తర్వాత కూడా మళ్లీ వస్తే పెద్ద పూజలు చేయాలని ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వారిని వెళ్లగొడతారు. వీరి వద్దకు కర్నూలు జిల్లా నుండే కాక అనంతపురం, కడప, హైదరాబాద్‌లతో పాటు కర్ణాటక నుంచి కూడా మానసిక రోగస్తులు వస్తూండడం కొసమెరుపు.  
మచ్చుకు కొన్ని..
––Ðð ల్దుర్తికి చెందిన ఓ వ్యక్తి కోడలికి గాలిసోకిందని మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లగా ఆమె వారి చేతుల్లో నరకయాతన పొంది మరణించినట్లు తెలిసింది.
–– క్షుద్ర పూజల సందర్భంగా మంత్రగాళ్లు సష్టించిన భయానక వాతావరణంతో హైదరాబాద్‌ వాసి గుండెపగిలి ఒకరు మరణించగా అమ్మవారు నరబలి తీసుకుందని, కుటుంబ సభ్యులకు సైతం మరణం ఉందని భయపెట్టి  బంగారు, లక్షల్లో పైకం వసూలు చేసినట్లు సమాచారం.
–– రామళ్లకోట వాసులైన తల్లీకూతుళ్లు పాతకోనేరులో పడి మతి చెందిన ఘటన క్షుద్రపూజల కోణంలోనే జరిగినట్లు తెలిసింది.
––రామళ్లకోటలో ఐరన్‌ అక్రమ తవ్వకాలతో కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుడైన యువకుడిని బలిచ్చి విషయం పొక్కకుండా వారి కుటుంబానికి డబ్బులిచ్చినట్లు సమాచార ం.

మరిన్ని వార్తలు