గుప్తనిధుల కోసం తవ్వకాలు

11 Aug, 2016 22:06 IST|Sakshi
  • నంది విగ్రహం అపహరణకు యత్నం? 
  • కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ మండలం నగునూరులోని పోచమ్మ ఆలయ ఆవరణలోని నంది విగ్రహాన్ని అపహరించేందుకు బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. స్థానికుల కథనం ప్రకారం.. పాపన్నగానిపల్లె శివారులోని పోచమ్మ ఆలయం ఎదుట ఉన్న పురాతనమైన నంది విగ్రహం కింద గుప్త నిధులున్నాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు సాగించారు. బుధవారం రాత్రి ట్రాలీలో వచ్చిన ముఠా సభ్యులు క్షుద్రపూజలు చేసి విగ్రహాన్ని కొంతదూరం తరలించారు. విగ్రహం జరిపిన చోట పసుపు, కుంకుమ చల్లి క్షుద్రపూజలు చేసి తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించగా.. సాధ్యంకాక వెళ్లిపోయారు. ఉదయం పొలాలకు వెళ్తున్న కొందరు రైతులు నంది విగ్రహం వేరేచోట ఉండడాన్ని గమనించి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయితే విగ్రహాన్నే తరలించే ప్రయత్నం చేశారని కొందరు భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు