అందరి సహకారంతోనే ఘనత

17 Sep, 2016 01:50 IST|Sakshi
అందరి సహకారంతోనే ఘనత
 
  • కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు
కావలిఅర్బన్‌: జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని కలెక్టర్‌ ఆర్‌ ముత్యాల రాజు పేర్కొన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవం సభలో కలెక్టర్‌ పాల్గొన్నారు. కావలి డివిజన్‌లో నూరు శాతం మరుగుదొడ్ల లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి జిల్లాలోని ఓడీఎఫ్‌ గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. మరుగుదొడ్లపై ప్రజలను చైతన్యం చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. నూరు శాతం మరుగుదొడ్లను పూర్తి చేసిన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీ రామిరెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్‌ ఎస్‌ఈ ఆర్వీ కృష్ణారెడ్డి, ఆత్మగౌరవం కోఆర్డినేటర్‌ సుస్మితారెడ్డి, ఆర్డీఓ సీఎల్‌ నరసింహం, ఎంపీపీ పర్రి మహేశ్వరి,  జెడ్పీటీసీ సభ్యులు పెంచలమ్మ, ఎంపీడీఓ ఎల్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు